గండ్ర లక్ష్మణరావు
Jump to navigation
Jump to search
గండ్ర లక్ష్మణరావు | |
---|---|
జననం | గండ్ర లక్ష్మణరావు పెగడపల్లి, జగిత్యాల జిల్లా |
నివాస ప్రాంతం | కరీంనగర్ |
వృత్తి | విశ్రాంత అధ్యాపకుడు |
ప్రసిద్ధి | కవి, అవధాని |
ఆధునిక తెలుగు సాహిత్య ప్రపంచంలో లబ్ధప్రతిష్ఠులైన తెలంగాణ సాహిత్యవేత్తలలో గండ్ర లక్ష్మణరావు ఒకడు. అష్టావధాని.
సాహిత్య సేవ
[మార్చు]ఇతడు తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహింపబడిన ప్రపంచ తెలుగు మహాసభలలో నిర్వాహక మండలి సభ్యునిగా పనిచేశాడు. విశ్వనాథ సత్యనారాయణ ప్రారంభించిన ‘జయంతి’ పత్రిక వెలిచాల కొండలరావు సంపాదకత్వంలో పునః ప్రారంభింపబడిన నాటినుండి సంపాదక మండలి సభ్యునిగా ఉన్నాడు. శ్రీభాష్యం పార్థసారథి స్థాపించిన కరీంనగర్ “ఆది వరాహక్షేత్ర” సంబంధమైన సాహిత్య సేవలో పాలు పంచుకుంటున్నాడు. కరీంనగర్ “సాహితీ గౌతమి” సంస్థ వ్యవస్థాపకులలో ఒకడు. సినారె అవార్డుల కమిటీ సభ్యుడు. “వేయిపడగలు”పై పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టా పొందాడు. “సాహితీరత్న” బిరుదాంచితుడు.
రచనలు
[మార్చు]- నీవు (ఆదిపాద మకుట శతకము)
- వర్తమాన సంధ్య (కవితా సంపుటి)
- సాహితీ వనమాలి (సాహిత్య వ్యాసాలు)
- ఒక పద్యం నేర్చుకుందాం (100 పద్యాలకు వ్యాఖ్యానం)
- శివా! (శతకము)
- శతద్రు (వచనకవిత్వము)
- శ్రీ లక్ష్మీనరసింహ శతకము
- భువన విజయము (రూపకము)
- వెఱ్ఱిమానవుడు (ఖలీల్ జిబ్రాన్ కవిత అనువాదం)
- ప్రస్తావన (పీఠికల సంపుటి)
- పెగడపల్లి శ్రీరాజరాజేశ్వరా (శతకము)
- తెలంగాణ పద్య కవితా వైభవం (తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణ)